పెండింగ్ దరఖాస్తులన్నింటికీ వెంటనే నిధులు మంజూరు చేయాలి

పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులందరు మళ్ళీ ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చేసిన నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలి!*


(Nprd రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ డిమాండ్. )

స్వయం ఉపాధి,పునరావాసం కోసం వికలాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖలో 2018 నుండి పెండింగ్లో ఉన్న దరఖాస్తులు అన్నింటికి నిధులు వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ దరఖాస్తుదారులందరు మళ్ళీ ఆన్ లైన్ చేసుకోవాలని చేసిన నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(NPRD) రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దివి: 11-01-2021 సోమవారం రోజున వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(Nprd) జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని వికలాంగుల, వయోవృద్ధుల జిల్లా సంక్షేమ అధికారి (A.D) కార్యాలయం ముందు వికలాంగులతో ధర్నా నిర్వహించడం జరిగింది, ఈ సందర్బంగా వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రం జిల్లా సంక్షేమ శాఖ అధికారి (A.D) J.జయంతి గారికి సమర్పించడం జరిగింది. ఈ సందర్బంగా వికలాంగుల సమస్యల పరిష్కారంకై కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించడం జరిగింది. ఈ ధర్నాకు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి జిల్లా వ్యాప్తంగా వందలాది మంది నిరుద్యోగులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. 2018 నుండి నిధులు విడుదల చేయకపోవడం ద్వారా వందలాది దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నవని తెలిపారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. 2020 -21 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా స్వయం ఉపాధి కోసం ఆన్లైన్ ద్వారా జనవరి 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. గతంలో దరఖాస్తు చేసిన వారందరూ మళ్లీ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ద్వారా గతంలో దరఖాస్తు చేసిన నిరుద్యోగ వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హెద్దేవా చేశారు. జనవరి 5న జరిగిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సమావేశంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులు అందరూ మళ్ళీ ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించారని అన్నారు. ఈ నిర్ణయాన్ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. 2018 నుండి మ్యాన్యువల్ లో దరఖాస్తు చేసిన దరఖాస్తులు అన్నింటిని వెంటనే క్లియర్ చేయాలని ఆ తర్వాతనే ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించాలని ఎన్పిఆర్డి డిమాండ్ చేస్తుందని అన్నారు. చాట్లో తౌడు పోసి కుక్కలను ఉసి గొల్పినట్లు పెండింగ్లో ఉన్న దరఖాస్తులు అన్నింటికీ అవసరమైన నిధులు విడుదల చేయకుండా పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారుల అందరూ మళ్లీ దరఖాస్తు చేయమనడం సరైంది కాదని విమర్శించారు. దీని ద్వారా సీనియారిటీ నష్టపోయి నిరుద్యోగ వికలాంగులు అనేక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందిని, తక్షణమే ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని విరమించుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డిమాండ్ చేస్తుందని తెలిపారు. లేనియెడల నిరుద్యోగ వికలాంగులను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భూమా రజిత, బండవరం శ్రీదేవి, మాలోతు రాజ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు ఆకారపు కుమార్, తోట సురేందర్, ఉప్పరి వేణు, జిల్లా కమిటీ సభ్యులు పిట్టల కుమార్, ఇట్టబోయిన మధు, రడపాక యాదగిరిలతో పాటు k.వినయ్, N.అరుణ, G.కనకలక్ష్మి, రాజవ్వ, మహేష్, ప్రభుదాస్, రావుల శ్రీనివాస్, గతంలో ఉపాధి రుణాలకు దరఖాస్తు చేసిన వికలాంగులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.