పెండింగ్ దరఖాస్తుల నిధులను తక్షణమే విడుదల చేయాలి

స్వయం ఉపాధి, పునరావాసం కోసం పెండింగ్లో ఉన్న వికలాంగుల దరఖాస్తులన్నింటికీ వెంటనే నిధులు మంజూరు చేయాలనీ జనవరి 11 న వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ముందు తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (Nprd) రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ పిలుపునిచ్చారు.

దివి: 09-01-2021 శనివారం రోజున పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో Nprd జిల్లా కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు అధ్యక్షతన ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ పాల్గొని మాట్లాడుతూ వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖలో 2018 నుంచి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి కొత్తగా స్వయం ఉపాధి కోసం ఆన్ లైన్ ద్వారా జనవరి 21లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసిన వారందరు మళ్ళీ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో గతంలో దరఖాస్తు చేసిన నిరుద్యోగ వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2018 నుంచి మ్యాన్యూవల్గా ఇచ్చిన దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని ఆతర్వాతనే ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తుదారులందరు మళ్ళీ దరఖాస్తు చేస్తే, వారు సీనియార్టీ నష్ట పోయి ఇబ్బందులు తలేత్తుతాయన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటె రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూమా రజిత, బండవరం శ్రీదేవి, ఉప్పరి వేణు, మోతె వెంకటమ్మ, మాలోతు రాజ్ కుమార్, కానుగు బాలనర్సయ్య, ఇట్టబోయిన మధు, ఆకారపు కుమార్, జీడీ నర్సయ్య, రడపాక యాదగిరి, వాతాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.