పెండింగ్ పెన్షన్లు , రేషన్ కార్డులు వెంటనే మంజూరు ఇవ్వాలని డిమాండ్

నల్లగొండ తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా తహసీల్దార్ నాగార్జునరెడ్డి కి వినతిపత్రం అందజేత.

రాష్ట్ర ప్రభుత్వం గత 6 సంవత్సరాలుగా పెన్షన్లు రేషన్ కార్డులు మంజూరు ఇవ్వడం లేదని వెంటనే పెండింగ్ లో ఉన్న అన్ని మంజూరు చెయ్యాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.ఈ రోజు సందర్భంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు వినతిపత్రం అందజేయడం జరిగింది.స్థానిక నల్లగొండ మండల తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ నాగార్జునరెడ్డి గారికి  వినతిపత్రం అందచేయటం జరిగింది.ఈ సందర్బంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం పేదల వైపు పరిశీలన చెయ్యడం లేదని పెన్షన్లు మంజూరు కాక మీ సేవా కేంద్రాల  జైలు చుట్టూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదని అన్నారు.ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయమని ఆరు సంవత్సరాలుగా వితంతు వికలాంగుల వృత్తిదారుల పెన్షన్లు మంజూరు చేయకపోవడం వల్ల  పేదలు అనేక అవస్థలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కనీసం నూతనంగా పెళ్లయిన వారికి నమోదు చేసుకునే ఆప్షన్ లేకుండా చేశారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డులు పెన్షన్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల కార్యదర్శి బొల్లు రవీంద్రకుమార్ నాయకులు మైనం నర్సింహా పి నర్సిరెడ్డి కొండా వెంకన్న జంజరాల లింగయ్య సాలమ్మ సురేష్ పుల్లెంల నాగరాజు రాములమ్మ వెంకమ్మ  తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.