పెట్టుబడిదారి దోపిడి సమాజానికి ప్రత్యామ్నాయం కమ్యూనిజమే

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్
జనగామ: పెట్టుబడిదారి దోపిడి సమాజానికి ప్రత్యామ్నాయం కమ్యూనిజమే అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అబ్బాస్ అన్నారు. శుక్రవారం పెంబర్తి గ్రామంలో సిపిఎం జనగాం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు శాఖా కార్యదర్శులకు జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ క్లాస్ కు ప్రిన్సిపాల్ గా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి వెంకటరాజ్యం వ్యవహరించారు. ఈ సందర్భంగా అబ్బాస్ క్లాసులను ప్రారంభం చేసి వర్తమాన రాజకీయ పరిస్థితి క్లాసు బోధించారు. ఈ సందర్భంగా ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెంచుతూ విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. పేదలకు భారాలు పెద్దలకు రాయితీలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.ప్రజల కష్టార్జితంతో కూడబెట్టుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని. ప్రజలపై పన్నుల భారాన్ని వేస్తూప్రజల నడ్డి విడిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయని పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని వారి డిమాండ్ చేశారు.
అనంతరం మతం-మతోన్మాదం క్లాసు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి రవికుమార్ బోధించారు. ఈ కార్యక్రమంలోసిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇర్రి అహల్య, రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, జిల్లా కమిటీ సభ్యులు పి ఉపేందర్, జోగు ప్రకాష్, బెల్లంకొండ వెంకటేష్, చిట్యాల సోమన్న, భూక్య చందు నాయక్, మండల కార్యదర్శిలు గంగాపురం మహేందర్, నాయకులు పంపర మల్లేష్, బొడ్డు కర్ణాకర్. సుంచు విజేందర్, కళ్యాణం లింగం . తుటి దేవదనం., పల్లెర్ల లలిత.పందిళ్ళ కళ్యాణి, పొన్నాల ఉమా, కొండ వరలక్ష్మి, చీర రజిత, మల్లారెడ్డి. భాష భాక విష్ణు. తాండ్ర ఆనందం. గంగరబోయిన మల్లేష్ రాజ్. తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.