హన్మకొండ:కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ ఈరోజు డివైఎఫ్ఐ, ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో హన్మకొండ కుమార్ పల్లి లోని ఆటోకు తాడుకట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు,కేంద్రంలో ఈ సందర్భంగా డివైఎఫ్ఐ వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం 2014లో పెట్రోల్ ధర 54 రూపాయలు ఉంటే ఇప్పుడు దాన్ని 94.37, డీజిల్ ధర 80 రూపాయల యాభై పైసలకు చేసిందని,అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర 2014లో 105 రూపాయలు ఉంటే పెట్రోల్ ధర 71, డీజిల్ ధర 56 రూపాయలు ఉండేదని,2020 సంవత్సరం లో క్రూడాయిల్ ధర 47,58 పైసలు ఉంటే పెట్రోల్ ధరను 94.37, డీజిల్ ధర 88.45 రూపాయలకు చేసిందని దీనివల్ల నిత్యవసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయని ప్రజల పై భారం మోపేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నారని అన్నారు, గ్యాస్ సిలిండర్ పై 546 ఉంటే ప్రస్తుతం 890 రూపాయలు పెంచిందని వంటనూనె 90 ఉంటే 150 రూపాయలకు చేరిందని ఉపాధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధరలు పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి. సంతోష్ డివైఎఫ్ఐ నాయకులు ఓకే నరసింహ, రాజేందర్, రాజు అఖిల్, సురేష్ శ్రీకాంత్ అనీలు రాజేష్, కిషోర్ మహేష్ ను పాల్గొన్నారు.
