పెట్రోల్, డీజిల్ ,వంటగ్యాస్ ధరలను ఉపసంహరించుకొవలి citu:కేంద్ర బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ,డీజిల్, వంటగ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న డిమాండుచేశారు*ఆదివారం స్థానిక పాలకుర్తి మండల కేంద్రం లోని చాకలి ఐలమ్మ స్మారక భవన్లో సిఐటియు కార్యకర్తల సమావేశానికి తోట రాజు అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా సోమన్న పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్, వంటగ్యాస్, ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారాలు మోపుతోందని మండిపడ్డారు,
బిజెపి పాలన అంటే అంబానీ ఆదాని
బడా పెట్టుబడిదారులకు దేశ సంపద దోచి పెట్టడమేనని తీవ్రంగా విమర్శించారు, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ, దేశంలో కష్టకాలంలో ఉన్న ప్రజలపై పెట్రోల్ ,డీజిల్, వంటగ్యాస్ ,ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరిచే చర్యలకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు, కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్లు సబ్సిడీలు రాయితీలు కల్పిస్తూ పేద ప్రజల సంక్షేమానికి తూట్లు పొడవడం దారుణమని అన్నారు, ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం బడా కార్పొరేట్ శక్తుల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం పెంచిన వంట గ్యాస్, పెట్రోల్ ,డీజిల్ ,ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎనగతల వెంకన్న, ఏనగతల సమ్మయ్య, పెద్దాపురం, భాస్కర్ రెడ్డి, ఏ రాజు, సొమ్ చంద్రు,ఎల్లయ్య, రామ్ చంద్రు, తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.