పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నియంత్రించాలి

కేంద్రంలోని BJP ప్రభుత్వం, చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను అడ్డు అదుపు లేకుండా పెంచి ప్రజలపై విపరీతమైన భారాలు వేస్తున్నదని, వెంటనే వాటి ధరలను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

దివి: 17-02-2021 బుధవారం రోజున పార్టీ కేంద్ర కమిటీ పిలుపు నేపథ్యంలో దేశ వ్యాప్త నిరసనలో భాగంగా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నియంత్రించాలని వంటావార్పుతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఈ ధరలను ప్రజలు భరించే స్థితిలో లేరని తక్షణమే కేంద్రం, రాష్ట్రం విధిస్తున్న సెస్, పన్నులను రద్దుచేసి వీటి ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 11రోజుల్లోనే 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 75 పెంచడంతో నేడు మన రాష్ట్రంలో ఈ సిలిండర్ ధర రూ. 821.50 లకు చేరుకుందని తెలిపారు. ఒకవైపు పేదమహిళలకిచ్చే ఉజ్వలగ్యాస్ పథకానికి లబ్దిదారులను పెంచుతామని కేంద్రం ప్రకటిస్తున్నప్పటికీ, మరోవైపు పేదలకు అందుబాటులో లేనివిధంగా కేంద్రం సిలిండర్ ధరలను పెంచుతున్నదని విమర్శించారు. గతంలో కేంద్రం దీనికోసం ఒక ప్రత్యేక అక్కౌంట్ను, నిధిని ఏర్పాటు చేసి చమురు ధరలు పెరిగినప్పుడల్లా వినియోగదారులపై భారం పడకుండా సర్దుబాటు చేసేదని అన్నారు. కానీ ఆ అక్కౌంట్ను, నిధిని నేడు పూర్తిగా ఎత్తివేయడంతో వినియోగదారులపై భారం పడుతున్నదని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో కూరగాయలతోపాటు, నిత్యావసరవస్తువుల, సరుకుల ధరలు విపరీతంగా మండుతున్నాయని విమర్శించారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ పై సెస్ ను విధించిందని దీనికితోడు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరుతో వినియోగదారుల నుండి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాయని అన్నారు. కరోనాతోపాటు, ఆదాయం పూర్తిగా తగ్గిపోయి సతమతమవుతున్న నేపథ్యంలో ప్రజలపై ఈ భారాలు మోపడం హేయమైన చర్య అని తెలిపారు. స్వేచ్ఛమార్కెట్ దయాదాక్షిణ్యాలకు వదిలేసి పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను ఇలాగే పెంచుకుంటూపోతే పేద, మధ్యతరగతి ప్రజల ఆగ్రహానికి కేంద్రం చవిచూడక తప్పదని హెచ్చరించారు. తక్షణమే ఈధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, బోట్ల శేఖర్, పట్టణ కమిటీ సభ్యులు జోగు ప్రకాష్, బిట్ల గణేష్, B.చందు నాయక్, పల్లెర్ల లలిత, md అజారోద్దిన్, k.లింగం, md.బుర్రానోద్దీన్, T.దేవదానం, U.వేణు, Md.మైబెల్లి, G.శివ, ch.ఉపేందర్, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.