ఈ69వార్త రహమత్ నగర్/హైదరాబాద్ ఏప్రిల్04
సిపిఎం రహమత్ నగర్ డివిజన్ ఎస్ పి ఆర్ హిల్స్ వద్ద ధరలు తగ్గించాలని నిరసన చేయడం జరిగింది .ఈకార్యక్రమంలో సిపిఎం పార్టీ జూబ్లీహిల్స్ జోన్ నాయకులు రాపర్తి అశోక్,G.బిక్షపతి మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం సామాన్య జనం పై కక్ష గట్టినట్టు గా ప్రజలు వాడే వస్తువుల ధరలను పెంచుతుంది. నూనె ,పప్పు రిటైల్ ధరల సుమారు 60 శాతం పెరిగాయి. పెట్రోల్ ,డీజిల్ చార్జీలు రోజు పెంచు పరోక్షంగా నిత్యావసర ధరలను పెంచే విధంగా చేస్తా ఉంది. అసంఘటిత రంగ కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ధరలు పెరిగి మరొక భారంగా అయిపోయాయి. రైతులు పండించిన ధాన్యం కొనే వారు లేక ఇబ్బంది పడుతుంటే వారి మీద నిత్యావసర ధరలు పెంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోలు డీజిల్ గ్యాస్ ఇతర నిత్యావసర ధరలు తగ్గించాలి రేషన్ కార్డు ద్వారా పేదలకు 15 రకాల సరుకులు సరఫరా చేసి మార్కెట్లో ఉన్నటువంటి ధరలను నియంత్రించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు లొంక సంపత్ ,నరసింహ,మాల్యాద్రి,లక్ష్మయ్య ,రమణమ్మ ,సాయిలు ,తదితరులు పాల్గొన్నారు.
