ఇటీవల కాలంలో కురిసిన ఆ కాల వర్షాలకు ఇల్లు కూలిపోయిన సంఘటన మండల పరిధిలోని సీతానగరం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సూరేపల్లి గురవయ్య అనారోగ్యం తో బాధపడుతున్న వారి కుటుంబాన్ని పరామర్శించి ఇంటి నిర్మాణం కోసం పదివేల రూపాయల ను ఆర్థిక సహాయన్ని కోదాడ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జ్ కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమం లో పాల్గొన్నా కోదాడ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని హమీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త కు అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో శశిధర్ రెడ్డి యువసేన నాయకులు రాయి రవి, కాసాని మల్లయ్యగౌడ్, కోట వెంకటేశ్వర్లు, సుంకర శ్రీనివాస్, ప్రశాంత్, రేపాల మాజీ వార్డు మెంబర్ మేరిగ వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.