మండలంలోని బృందావనపురం గ్రామంలో నెలవారీగా ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్ల కోసం గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గీత కార్మికులు మంగళవారం పెన్షన్ కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు పెన్షన్ ఇచ్చే అధికారి కోసం వేచి చూసి పెన్షన్ ఇచ్చే అధికారి ఎంతకీ రాకపోవడం పట్ల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారుల పక్షాన తెలుగుదేశం పార్టీ మండలం ఉపాధ్యక్షుడు దొంతగాని శ్రీనివాస్ సంబంధిత అధికారితో పెన్షన్ల విషయమై ఫోన్లో సంప్రదించగా నేను ఈరోజు పెన్షన్లు ఇస్తానని ఎవరితో చెప్పలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. వృద్ధులు,వికలాంగులు, వితంతువులకు ఇబ్బందులకు గురి చేయకుండా పెన్షన్లు ఇప్పించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి సత్తయ్య, పుట్టా సత్యం, సొంటి లక్ష్మీ నరసమ్మ ,మండవ వీరయ్య, కాసాని సీతారాములు, కాసాని అంజయ్య, తదితరులు పాల్గొన్నారు..