–సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు
— కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా

-వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయం ఏవో గారికి అందజేసిన సిఐటియు నాయకులు

జనగామ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల జీవాలను సవరించి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో ఏవో గారికి అందజేశారు
ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమానికి CITU జిల్లా అధ్యక్షులు బోట్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఎనిమిది సంవత్సరాల నుండి కనీస వేతనాల జీవోలను సహకరించక పోవడంతో 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కోటి ఇరవై లక్షల మంది కార్మికులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి సంతకం పెడితే కోటి 20 లక్షల మందికి వేతనాలు పెరిగే అవకాశం ఉందని ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు హమాలి ఆటో రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు చేశారు హమాలీ కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని అన్నారు రైస్ మిల్ లో పరిశ్రమలను కాపాడాలని సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్ సిఐ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు 50 సంవత్సరాలు నిండిన హమాలి భవనం ట్రాన్స్పోర్టు కార్మికులకు నెలకు 5 వేల పింఛన్ ఇవ్వాలని పై న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జోగు ప్రకాష్ బెల్లంకొండ వెంకటేష్ చిట్యాల సోమన్న దొర గొల్ల యాదగిరి తాండ్ర ఆనందం గంగాపురం మహేందర్ పండుగ రాజారాం బి పెంటయ్య మంద సంపత్ మల్లేష్ రాజ్ గడ మల్ల రవి చెక్క పరుశరాములు జి భాస్కర్ మద్దూరి యాదగిరి సింగిరెడ్డి మల్లారెడ్డి దొర గొల్ల సత్తయ్య ఆరూరి ఐలయ్య కాటా బిక్షపతి చేవెల్లి శ్రీశైలం కాట రాజు వివిధ మండలాల నుండి కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.