తమ్మడపల్లి జి/జఫర్ ఘడ్
మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో వర్ధన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్ మరియు జఫర్ ఘడ్ ఎస్సై మాధవ గౌడ్ ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఐ సదన్ కుమార్ మాట్లాడుతూ జూదం వలనే సమాజంలో అవినీతి, అక్రమాలు పెరిగి పోతున్నాయని గుట్కా, తంబాకు,గంజాయి లాంటి మత్తు పదార్ధాల వలన, క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడుతున్నారని,కాబట్టి గ్రామంలో ఎవ్వరూ కూడా పేకాట ఆడినా,గుట్కా,తంబాకు,గంజాయి లాంటి పదార్థాలు అమ్మినా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే గ్రామంలో వాడ వాడకు దాతల సహకారం తో సి సి కెమరాలు ఏర్పాటు చేయాలని, ద్విచక్ర వాహన దారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముహమ్మద్ షరీఫుద్దీన్,గ్రామస్థులు గుండెబోయిన రాజు, కొంతం నాగేష్, మారపల్లి రవి, రాపర్తి నవీన్,రంగు రజిని కాంత్, యుగేందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
