పేకాట స్థావరం పై పోలీసుల ఆకస్మిక దాడి.9 మంది పేకాట రాయుల్లను అరెస్ట్ చేసిన పామిడి సి ఐ…
పామిడి సమాచారం….పామిడి మండలం కట్టకిందపల్లి గ్రామ సమీపంలో గల ఈతవనంలో కొంతమంది వ్యక్తులు కలిసి మంగాపత్తా పేకాట ఆడుతున్నారని రాబడిన సమాచారం మేరకు సి ఐ పి.శ్యామరావు, ఎస్సై గంగాధర్ మరియు సిబ్బంది కలిసి ఈ రోజు ఉదయం అక్కడికి వెళ్లి సదరు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద ఉన్న 40,115 /- రూపాయలను మరియు పేక ముక్కలను స్వాదీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయడమైనది. పామిడి టౌనులో గాని మరియు పామిడి మండలం లో చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపా లకు గాని మరియు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినట్లఅయితే వారి పైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం అయినది.
