పేదలకు అండగా YSRCP

అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం అయినటువంటి
గుత్తి పట్టణం నందు రోడ్డు విస్తరణలో భాగంలో వృద్ధ దంపతులు ఇల్లు కోల్పోయి గుత్తిలో స్థానిక బస్టాండ్ నందు తలదాచుకునే వాళ్ళు ఈ విషయం తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్సిపి పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా , మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తాత్కాలికంగా వృద్ధాశ్రమంలో ఉండటానికి ఏర్పాటు చేసి వారికి ఇళ్లు కట్టిస్తామని మాట ఇవ్వడం జరిగింది. గత కొద్దిరోజులుగా ఆశ్రమంలో ఉన్న వృద్దులకు ఇచ్చిన మాట ప్రకారం వారికి గుత్తి ఫుట్ బాల్ గ్రౌండ్ సమీపంలోని పింఛన్ అసోసియేషన్ భవనం దగ్గర నివసించడానికి నిర్మించిన టువంటి ఇంటి నందు ఈరోజు సాయంత్రం 5.00 గంటలకు వారిని చైర్ పర్సన్ వన్నూరు బి గారి ఆధ్వర్యంలో అందులో చేర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా గా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ వై ఎస్ ఆర్ సి పి పేదలకు ఎప్పుడు అండగా ఉంటుందని ఏ కష్టం వచ్చినా సహాయం చేయడంలో వెనకడుగు వెయ్యమని అదేవిధంగా నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చిన సహాయ సహకారాలు అందించడానికి ఎమ్మెల్యే గారు ముందు ఉంటారని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో లో వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ శివ, వైయస్సార్ సిపి నాయకులు సునీల్ ,యువ నాయకులు షఫీ , రమేష్ ,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.