పేదల తరఫున జెండాలు పాతి పోరాటాన్ని ప్రారంభించిన సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు

ప్రత్యక్ష పోరాటాన్ని ప్రారంభించారు. సిపిఎం పార్టీ , ప్రజా సంఘాల నాయకత్వాన వందలాది మంది పేదలు ప్రభుత్వ భూములో జెండాలు పాతారు.
ఈ సందర్భంగా జరిగిన సభకు బొడ్డు కరుణాకర్ అధ్యక్షత వహించగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి వెంకట్రాజం , కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి బోట్ల శేఖర్, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పిఆర్డి) జిల్లా కార్యదర్శి బిట్ల గణేష్ వివిధ ప్రజా సంఘాల నాయకులు సింగారపు రమేష్, తూటి దేవదానం లు పాల్గొని మాట్లాడుతూ గత అనేక రోజులుగా ఈ భూమికి సంబంధించిన అన్ని వివరాలను మండల రెవెన్యూ అధికారుల దృష్టికి, జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగిందని, అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో, గత్యంతరం లేని స్థితిలో ఈరోజు ప్రత్యక్షంగా భూమి పైకి వెళ్లి పోరాటాన్ని ప్రారంభించాల్సి వచ్చిందని ఈ సందర్భంగా నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తను అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాల ముందు పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తామని వాగ్దానం చేసి నేటికీ అమలు చేయలేదని, వేలాది మంది పేదలు ఇండ్లు లేక నానా అవస్థలు పడుతున్నారని, పేదలు పేదలుగానే ఉంటూ పెద్దలు మరింత ధనవంతులయ్యే విధానాలను పాలకులు అవలంబిస్తున్నంతకాలం ప్రజలు పోరాటంలోకి రాక తప్పదని ఈ సందర్భంగా అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి, ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్న మాటను నెరవేరిస్తే ఇవాళ ఈ పేదలు భూముల మీదికి, ఇండ్ల స్థలాల కోసం ప్రత్యక్షంగా పోరాటంలోకి వచ్చే వారే కాదని హితవుపలికారు.
జిల్లా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు పంతానికి పోకుండా పేదలు చేపట్టిన ఈ న్యాయమైన పోరాటానికి ఆటంకాలు కల్పించకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా పేదల పోరాటం కొనసాగుతుందని, గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు చేపట్టిన ఈ ఇండ్ల స్థలాల పోరాటం విజయవంతం కావడం కోసం అన్ని తరగతుల ప్రజానీకం సహకరించాలని కోరారు.
పోరాటాలు కమ్యూనిస్టులకు కొత్త కాదని, నిత్యం పేదల పక్షాన ఉండేది కమ్యూనిస్టులు మాత్రమేనని, పేద ప్రజలను మరింత ఐక్యపరిచి పోరాటాలను మరింత ముందుకు తీసుకోవడానికి పార్టీ ప్రజాసంఘాలు కృషి చేస్తున్నాయని, పేదలుతమ ఆత్మగౌరవం కోసం చేసే ఈ పోరాటానికి ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే సహకరించాలని, లేదంటే ప్రజల ఆగ్రహంలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ, ప్రజా సంఘాల నాయకులు పి,ఉపేందర్, గంగాపురం మహేందర్, పల్లెర్ల లలిత, మబ్బు ఉప్పలయ్య, చెన్నూరు ఉప్పలయ్య, చింత ఎల్లయ్య, పాముకుంట్ల చందు, గడ్డం యాదగిరి, ఇట్టబోయిన మధు, గడ్డం మహేందర్, గంగరబోయిన మల్లేష్ రాజ్, నిమ్మల లక్ష్మయ్య తదితరుల తో పాటు వివిధ గ్రామాల పేదలు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.