#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

డోర్నకల్ ఎమ్మేల్యే డిఎస్ రెడ్యా నాయక్

మరిపెడ మండలము ఎల్లంపెట గ్రామంలో రూ. 7కోట్ల 50 లక్షల వ్యయం తో నిర్మించిన 120 డబుల్ బెడ్ రూం ఇండ్లను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 120 ఇండ్ల నూ నిర్మించి లబ్ధిదారులకు అందజేసి సామూహిక గృహ ప్రవేశం చేయుంచినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి ఎమ్మ్యేల్యే డీఎస్. రెడ్యనాయక్ రూ.2కోట్ల 80లక్షలు మంజూరు చేయటం పట్ల స్థానిక సర్పంచ్ , మండల సర్పంచ్ తాళ్ళపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ నవీన్ రావు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు డీఎస్ రవిచంద్ర, ఎంపిపి గుగులోతు అరుణ, జడ్పీటీసీ తేజవతు శారద , మున్సిపల్ చైర్మన్ గుగులోతు సింధూరకుమారిలు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.