పోరాడి సాధించుకున్న జనగామ జిల్లా అభివృద్ధిలో పేరు గొప్ప ఊరు దిబ్బ చందంలా ఉందని జిల్లా అభివృద్ధికి, జనగామ పట్టణ సుందరీకరణకు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని అసంపూర్తిగా ఉన్న పట్టణ సుందరీకరణ పనులను వెంటనే పూర్తి చేసి జనగామ జిల్లా ప్రజలకు సహకరించాలని జనగామ ఎవల్యూషన్ జిల్లా ప్రతినిధి బిట్ల గణేష్ డిమాండ్ చేశారు.
దివి: 28-02-2021ఆదివారం రోజున పట్టణంలోని స్థానిక కార్యాలయంలో E.మధు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో బిట్ల గణేష్ పాల్గొని మాట్లాడుతూ జనగామ గడ్డకు పోరాట చరిత్ర ఉందని, జనగామ ప్రాంతం పోరాటాలకు పురిటిగడ్డని అన్నారు, ఆ పోరాటం స్ఫూర్తిని పునికిపుచ్చుకొని జనగామ జిల్లాను సాధించుకున్న ఘనమైన చరిత్ర మన జనగామ ప్రజలదని తెలిపారు. పోరాడి సాధించుకున్న జనగామ జిల్లా అభివృద్ధిలో జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. గత 2 సంవత్సరాలనుండి పట్టణ సుందరీకరణ పేరుతో జరుగుతున్నా పనులు చూస్తుంటే ప్రజలను, వ్యాపారస్తులను ఇబ్బందులకు గురిచేయడం తప్ప మరోటిలేదని అన్నారు. జనగామ ప్రాంతాన్ని సామాజికంగా, ఆర్దికంగా, రాజకీయంగా అణగదొక్కి పబ్బం గడుపుతున్నారేతప్ప జనగామ ప్రాంత ప్రజలకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. జనగామ జిల్లాలో అనేక సమస్యలున్నాయని అలాగే జిల్లాలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. కొంతమంది స్వార్ధ రాజకీయాలకోసం జనగామ ప్రాంతాన్ని, జనగామ ప్రజల్ని మోసం చేస్తున్నారని, రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ, ప్రజల ఆస్తుల్ని లూటీచేస్తూ జనగామ జిల్లాను పేరుగొప్ప ఊరుదిబ్బగా మారుస్తున్నారని తెలిపారు. జనగామ ప్రాంత అభివృద్ధికి, పట్టణ సుందరీకరణకు ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారు, పనుల అలసత్వానికి గల కారణాలపై జిల్లా ఉన్నతాధికారులు శ్వేతపత్రం విడుదల చెయ్యాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణ సుందరీకరణ పనులపై నిర్లక్ష్యం వీడి జనగామ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో P. చందు, U. వేణు, B. శ్రీదేవి, P. మంజుల, B. రజిత, M. రాజ్ కుమార్, K. వినయ్ తదితరులు పాల్గొన్నారు.