aiks telugu news local news

రాష్ట్ర సదస్సులో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్ పిలుపు

నిర్మల్ పట్టణంలోని హిర ఫంక్షన్ హల్ లో ఈ రోజు తెలంగాణ రైతు సంఘం నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోడు భూముల రాష్ట్ర సదస్సు సంఘం జిల్లా అధ్యక్షులు ఇప్ప లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది. అనంతరం
సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పోడు సాగుదారులు ధరఖాస్తు చేసుకుంటే భూమిపై హక్కులు కల్పిస్తామని తెరాస ప్రభుత్వం హామీ ఇచ్చి 8 నెలలు గడిచిందని గుర్తు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జోక్యం కల్పించుకొని సమస్యను పరిష్కరిస్తామని అనేక సందర్భలలో ప్రకటించారన్నారు. ఇటీవల అఖిలపక్షాల తరుపున రాస్తారోకో చేసిన సందర్భంగా కూడా ప్రభుత్వం అర్హులను ధరఖాస్తులు పెట్టుకోమని కోరిందన్నారు. ప్రభుత్వం హామీపై అర్హులంతా 3.5 లక్షల ధరఖాస్తులు 13 లక్షల ఎకరాలకు ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా చేసుకున్నారు. కానీ ఇంత వరకు ప్రభుత్వం ధరఖాస్తుల పరిశీలన చేయలేదు. గిరిజనులు, అడవులలో నివసిస్తున్న పేదలు ప్రభుత్వం నుండి హక్కు పత్రాలు రాకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారనీ అన్నారు. ప్రభుత్వం ఆదేశాలు లేకున్నా, ఫారెస్టు అధికారులు, పోలీసులు కలిసి సాగుకు ఆటంకం కలిగిస్తున్నారనీ అన్నారు. చట్టాన్ని దిక్కరించి ఫారెస్టువారు అనవసరంగా రైతులను ఇబ్బందులపాలు చేస్తున్నారనీ అన్నారు. ప్రభుత్వ వ్రాతపుర్వక ఆదేశాలు లేకుండా భూమిపైకి ఫారెస్టు వారు రాకూడదు. ప్రభుత్వం అర్హులు పెట్టిన ధరఖాస్తులను పరిశీలించి వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. అక్రమ కేసులు, నిర్భంధఖాండకు స్వస్తి చెప్పి సమస్యను శాంతియుతంగా వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే భూములకు హక్కు పత్రాల కోసం ఐక్య పోరాటాలు నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈ సదస్సులో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండి దత్తాత్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దుర్గం నూతన్ కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి డాకూర్ తిరుపతి, జిల్లా కోశాధికారి నాగేల్లి నర్సయ్య, అదిలాబాద్ జిల్లా కార్యదర్శి గంగారెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి బొమ్మను సురేష్, ఆకొండపేట గ్రామ సర్పంచ్ దుర్గం పోశలింగం, కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ ద్యావత్ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.