పోడు భూముల సమస్య పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలం


హరిత హరం పేరుతో పోడు భూములు లాక్కునే కుట్ర చేస్తున్న కెసిఆర్
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
కొత్త పోడు మండల కేంద్రములో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు కొత్త గూడ మండల కేంద్రము లో ఏర్పాటు విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ
కాంగ్రెస్ హయం లో పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తే ఈ ప్రభుత్వం హరిత హరం పేరుతో భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని
గత వారం రోజులుగా ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోడు రైతుల పై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ రైతులను బాయాబ్రంతులకు గురి చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులు రైతుల పై దాడులు చేస్తూ భూముల చుట్టూ స్ట్రెంచ్ లు కొడుతున్నారని వారు ఫారెస్ట్ అధికారుల పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
2014 ఎన్నికల సమయములో కెసిఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ 7 ఏండ్లు గడిచిన ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వక పొగ హరితరం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని
మొన్న జరిగిన బడ్జెట్ సమావేశములో నేను పోడు
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే సంబంధిత మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఫారెస్ట్ అధికారుల దాడులను అరికట్టేందుకు ముఖ్య మంత్రి తో మాట్లాడుతానని చెప్పిన మంత్రి ఇప్పటి వరకు దాడుల పై స్పందించక పోవడం బాధాకరం అని
పోడు భూముల చుట్టూ ఫారెస్ట్ అధికారులు స్ట్రెంచ్ కొట్టుతుండగా రైతులు ఫారెస్ట్ అధికారులను అడ్డుకోవడం జరుగుతుందని వెంటనే ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని లేని యెడల పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని సీతక్క గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
గత 30 యేండ్ల నుండి సాగు చేసుకున్న భూములను ఫారెస్ట్ అధికారులు హరిత హరం పేరుతో పోడు భూముల చుట్టూ స్ట్రెంచ్ కొడుతూ బయబ్రంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు ముఖ్య మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
TPCC ఆర్గనైజింగ్. కార్యదర్శి చల్లా నారాయణ రెడ్డి గారు, కందిమల్ల మసుధన్ రెడ్డి EX ZPTC గారు, కారోజ్ రమేష్ EX ZPTC గారు, బాణోత్ విజయ రూఫ్సింగ్ MPP గారు, పులుసం పుష్పాలత ZPTC గారు ప్రెసిడెంట్ వజ్జ సారయ్య గారు, సుంకరబోయిన మోగిలి PACS డైరెక్టర్ & వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, కాడబోయిన జంపన్న వైస్ MPP గారు, మల్లెల రణధీర్ కొత్తగూడ సర్పంచ్ గారు, MD సయ్యద్ మండల కో ఆఫ్షన్ గారు, ముస్కు వెంకన్న కిసాన్ సెల్ మండల అధ్యక్షులు , వెలుదండి వేణు BC సెల్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.