హరిత హరం పేరుతో పోడు భూములు లాక్కునే కుట్ర చేస్తున్న కెసిఆర్
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
కొత్త పోడు కొట్టేది లేదు పాత పోడు వదులుకునేది లేదు
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు ములుగు మండలం లోని జగ్గన్న పేట గ్రామములో పోడు భూముల రైతులతో సమావేశం అయిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ
కాంగ్రెస్ హయం లో పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తే ఈ ప్రభుత్వం హరిత హరం పేరుతో భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని
గత వారం రోజులుగా ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోడు రైతుల పై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ రైతులను బాయాబ్రంతులకు గురి చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులు రైతుల పై దాడులు చేస్తూ భూముల చుట్టూ స్ట్రెంచ్ లు కొడుతున్నారని వారు ఫారెస్ట్ అధికారుల పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
2014 ఎన్నికల సమయములో కెసిఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ 7 ఏండ్లు గడిచిన ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వక పొగ హరితరం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని
మొన్న జరిగిన బడ్జెట్ సమావేశములో నేను పోడు
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే సంబంధిత మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఫారెస్ట్ అధికారుల దాడులను అరికట్టేందుకు ముఖ్య మంత్రి తో మాట్లాడుతానని చెప్పిన మంత్రి ఇప్పటి వరకు దాడుల పై స్పందించక పోవడం బాధాకరం అని
పోడు భూముల చుట్టూ ఫారెస్ట్ అధికారులు స్ట్రెంచ్ కొట్టుతుండగా రైతులు ఫారెస్ట్ అధికారులను అడ్డుకోవడం జరుగుతుందని వెంటనే ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని లేని యెడల పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని సీతక్క గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
గత 30 యేండ్ల నుండి సాగు చేసుకున్న భూములను ఫారెస్ట్ అధికారులు హరిత హరం పేరుతో పోడు భూముల చుట్టూ స్ట్రెంచ్ కొడుతూ బయబ్రంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు ముఖ్య మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా
వెంక టా పూర్ మండల అధ్యక్షుడు
చెన్నో జు సూర్యనారాయణ
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జటో త్ గణేష్
కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి ఛక్రపు రాజు,కిసాన్ సెల్ ప్రచార కార్యదర్శి నునేటి శ్యాం,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి
ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి
యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఆంగోత్ వంశీ
కిసాన్ సెల్ మండల కార్యదర్శి భౌ సింగ్,ఉప సర్పంచ్ రౌత్ శ్రీనివాస్
గ్రామ కమిటీ అధ్యక్షులు అర్రెం వెంకన్న,వార్డు సభ్యులు బూర్క విష్ణు,కంది దేవేందర్, దోబే సమ్మక్క
చంటి,సీనియర్ నాయకులు ఏట్టి బుషణం,గణేష్,వంక తిరుపతి సమ్మయ్య,సదయ్య,పోషలు,సాంబయ్య,మేడం రమణ కర్ బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.