కొత్త పోడు కొట్టేది లేదు పాత పోడు వదులుకునేది లేదు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి


అని కోరుతూ ఎమ్మెల్యే సీతక్క గారికి వినతి పత్రం అందించిన రైతులు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
కొత్త పోడు కొట్టేది లేదు పాత పోడు వదులుకునేది లేదు
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు

ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని కోరుతూ ములుగు ఎమ్మెల్యే సీతక్క గారికి వినతి పత్రం అందించిన రైతులు
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ
గత 4 రోజులుగా కన్నాయిగూడెం మండలం కేంద్రం లో మండలం వ్యాప్తంగా పోడు రైతుల పై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ రైతులను బాయాబ్రంతులకు గురి చేస్తున్నారని నిన్నటికి నిన్న బుట్టాయిగూడెం, సర్వాయి, గ్రామాలలో అదే విధంగా ఫారెస్ట్ అధికారులు రైతుల పై దాడులు చేస్తూ భూముల చుట్టూ స్ట్రెంచ్ లు కొడుతున్నారని వారు ఫారెస్ట్ అధికారుల పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
2014 ఎన్నికల సమయములో కెసిఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ 7 ఏండ్లు గడిచిన ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వక పొగ హరితరం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని
మొన్న జరిగిన బడ్జెట్ సమావేశములో నేను పోడు
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే సంబంధిత మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఫారెస్ట్ అధికారుల దాడులను అరికట్టేందుకు ముఖ్య మంత్రి తో మాట్లాడుతానని చెప్పిన మంత్రి ఇప్పటి వరకు దాడుల పై స్పందించక పోవడం బాధాకరం అని
పోడు భూముల చుట్టూ ఫారెస్ట్ అధికారులు స్ట్రెంచ్ కొట్టుతుండగా రైతులు ఫారెస్ట్ అధికారులను అడ్డుకోవడం జరుగుతుందని వెంటనే ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని లేని యెడల పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని సీతక్క గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
గత 30 యేండ్ల నుండి సాగు చేసుకున్న భూములను ఫారెస్ట్ అధికారులు హరిత హరం పేరుతో పోడు భూముల చుట్టూ స్ట్రెంచ్ కొడుతూ బయబ్రంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు ముఖ్య మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా
మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షకీల్,జిల్లా కార్యదర్శి ఎండీ ఆ జ్జు
ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బద్రూ నాయక్,దేవ్ సింగ్,తోట ప్రవీణ్
కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి ఛక్రపు రాజు,మేడం రమణ కర్
కాన్నాయి గూడెం మండల రైతులు మరియు వైస్ ఎంపీపీ బొల్లే భాస్కర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జాడి రాంబాబు, కిషన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాటి రాజబాబు, sc సెల్ మండల అధ్యక్షులు సునరకాని రాంబాబు, బీసీ సెల్ అధ్యక్షులు కటకం మల్లన్న,
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.