MULUGU NEWS SETHAKKA NEWS

అసెంబ్లీ సాక్షిగా ముఖ్య మంత్రి కెసిఆర్ గారు కుర్చీ వేసుకొని మరి పోడు భూముల సమస్య పరిష్కరిస్తా అన్నాడు
గత కాంగ్రెస్ హాయం లో పోడు భూములకు పట్టాలు ఇస్తే ఈ ప్రభుత్వం హరిత హరం పేరుతో భూములు గుంజుకుంటుంది
కొత్త పోడు కొట్టేది లేదు పాత పోడు వదులు కునేది లేదు
ఇలానే ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తే గ్రామాలలో ఫారెస్ట్ అధికారులను ప్రజలు అడ్డుకొండి
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు మంగపేట మండల కేంద్రములో ఫారెస్ట్ కార్యాలయం ఎదుట పోడు భూముల రైతుల పై దాడులు చేస్తున్న ఫారెస్ట్ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పోడు రైతులతో బయటించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్య మంత్రి కెసిఆర్ గారు పోడు భూములకు పట్టాలు ఇస్తా అవసరమైతే కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని చెప్పిన ముఖ్య మంత్రి కెసిఆర్ గారు ఫారెస్ట్ అధికారులు దాడులు అగపడట్లేదా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ రైతులను భయాబ్రంతులకు గురి చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులు రైతులపై దాడులు చేస్తూ భూముల చుట్టూ స్ట్రెంచ్ లు కొడుతున్నారని ఫారెస్ట్ అధికారులపై మండి పడ్డారు
2014 ఎన్నికల సమయములో పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ 8 ఏళ్ళు గడిచినా ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వక పొగ హరితహారం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఈ ప్రాంతం నుండి నీళ్ళు,ఇసుక తిసుకుపోతరు కానీ ఈ ప్రాంతాల అభివృద్ధికి మాత్రం అడ్డుకుంటారా హరిత హరం పేరుతో ఫారెస్ట్ అధికారులు గ్రామాల్లో కనీసం రోడ్లు వేయవద్దని కరెంట్ లైన్స్ వెయ్యకుండా అడ్డుపడుతున్నారు
మొన్న జరిగిన బడ్జెట్ సమావేశములో తాను పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే సంబంధిత మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఫారెస్ట్ అధికారుల దాడులను అరికట్టేందుకు ముఖ్య మంత్రితో మాట్లాడుతానని చెప్పి ఇప్పటి వరకు దాడుల పై స్పందించక పోవడం బాధాకరం అని అన్నారు.
పోడు భూముల చుట్టూ ఫారెస్ట్ అధికారులు స్ట్రెంచ్ కొట్టుతుండగా రైతులు ఫారెస్ట్ అధికారులను అడ్డుకోవడం జరుగుతుందని వెంటనే ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని లేని యెడల పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత 30 యేండ్ల నుండి సాగు చేసుకున్న భూముల చుట్టూ ఫారెస్ట్ అధికారులు హరితహారం పేరుతో స్ట్రెంచ్ కొడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.
ముఖ్య మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలి అని సీతక్క గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి, జాతీయ మిర్చి టాస్క్ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సంబశివరెడ్డి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పూజారి సురేందర్ బాబు జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి బ్లాక్ అధ్యక్షుడు ఈర్సవడ్ల వెంకన్న చిట మాట రఘు,బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహారావు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్సార్ ఖాన్ ఉపాధ్యక్షుడు తూడి భగవాన్ రెడ్డి ప్రధాన కార్యదర్సులు అయ్యోరి యన్నయ్య మైపా లాలయ్య లక్కీ వెంకన్న కడబోయిన నరేందర్ మండల అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి కిసాన్ సెల్ మండల అధ్యక్షులు చౌలం వెంకన్న ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లన్న బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు హిడైతులా యూత్ గౌరవ అధ్యక్షుడు జంగం బానుచందర్ ఉపాధ్యక్షుడు కుర్సం రమేష్ సీనియర్ నాయకులు మసిరెడ్డి వెంకట్ రెడ్డి కారుపోతుల నరయ్య నర్రా కిషోర్ కొమరం సారయ్య బలన్న వేమ రవి చెట్టుపల్లి వెంకటేశ్వర్లు మైనుద్దీన్ కోడెల నరేష్ వీర్ల రఘు బూర్గుల సతీష్ గాంగేర్ల రాజరత్నం ఎంపల్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.