పోడు రైతుల పై ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలి

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
కొత్త పోడు కొట్టేది లేదు పాత పోడు వదులుకునేది లేదు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు మాట్లాడుతూ
గత రెండు రోజులుగా ములుగు జిల్లా వ్యాప్తంగా పోడు రైతుల పై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ రైతులను బాయాబ్రంతులకు గురి చేస్తున్నారని నిన్నటికి నిన్న కాన్నయి గూడెం మండలం లో అదే విధంగా ములుగు మండలం లో ఫారెస్ట్ అధికారులు రైతుల పై దాడులు చేస్తూ భూముల చుట్టూ స్ట్రెంచ్ లు కొడుతున్నారని అయన ఫారెస్ట్ అధికారుల పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
2014 ఎన్నికల సమయములో కెసిఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ 7 ఏండ్లు గడిచిన ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వక పొగ హరితరం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని
మొన్న జరిగిన బడ్జెట్ సమావేశములో మా నాయకురాలు
ములుగు ఎమ్మెల్యే సీతక్క పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే సంబంధిత మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఫారెస్ట్ అధికారుల దాడులను అరికట్టేందుకు ముఖ్య మంత్రి తో మాట్లాడుతానని చెప్పిన మంత్రి ఇప్పటి వరకు దాడుల పై స్పందించక పోవడం బాధాకరం అని
పోడు భూముల చుట్టూ ఫారెస్ట్ అధికారులు స్ట్రెంచ్ కొట్టుతుండగా రైతులు ఫారెస్ట్ అధికారులను అడ్డుకోవడం జరుగుతుందని వెంటనే ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని లేని యెడల పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
గత 30 యేండ్ల నుండి సాగు చేసుకున్న భూములను ఫారెస్ట్ అధికారులు హరిత హరం పేరుతో పోడు భూముల చుట్టూ స్ట్రెంచ్ కొడుతూ బయబ్రంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు ముఖ్య మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,మాజీ ఎంపీటీసీ కొమురయ్య,వార్డు సభ్యులు రవి
శ్యాం సుందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.