పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రవీంద్రనాధ్ బాబు, IPS గారి ఆదేశాల మేరకు, కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్. పి శ్రీమతి మల్లికా గార్గ్, IPS సూచనల మేరకు, నందిగామ డీఎస్పీ శ్రీ జి. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో
నందిగామ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ పి. కనకరావు మరియు ఎస్.ఐ శ్రీ తాతాచార్యులు గారు మరియు సిబ్బందితో కలిసి నందిగామ మండలంలో ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా
1. ప్రజలకు అమూల్యమైన ఓటు హక్కు వినియోగం పై అవగాహన కల్పించడం.
2. పోలింగ్ రోజు పాటించవలసిన నిబంధనలపై ప్రజలకు అవగాహన
3. ఎవరైనా సరే ప్రజల శాంతి భద్రతల విఘాతం కలిగించినచో తీసుకోను చట్టపరమైన చర్యలపై అవగాహనా కల్పిస్తూ నందిగామ పోలీసు వారు పెద్దవరం, లింగాలపాడు, చెరువుకొమ్మూపాలెం గ్రామములో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ఎలక్షన్ లపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది.