#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69News

జీవితమంతా ప్రజలకు సేవ చేయడంహే మాకు ముందు ఉన్న లక్ష్యం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు అన్నారు.శుక్రవారం చిట్యాల మండల కేంద్రములోని రైతు వేదికలో ఎంపిపి దావు వినోద వీరారెడ్డి అధ్యక్షతన కళ్యాణ లక్ష్మీ, షాధి ముబారక్,సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు.మా జన్మాంత కాలం భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అను నిత్యం సేవ చేయడం మా భాగ్యంగా భావిస్తున్నాం అని అన్నారు.దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్న గా మేన మామగా,తండ్రి లా ఈ రోజు కళ్యాణ లక్ష్మీ ,షాధి ముబారక్ చెక్కులను అంద చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ అని అన్నారు.ఈ సందర్భంగా లబ్దిదారులకు చెక్కులను అందచేశారు. అనంతరం చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వడ్ల కొనుగోలు కేంద్రం ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గారు ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గొర్రె సాగర్,పిఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అరెపల్లి మల్లయ్య,స్థానిక ఇంచార్జి సర్పంచ్ పూర్ణ చెందర్ రావు,ఎంపిటిసిలు కట్కూరి పద్మ నరేందర్,దబ్బేట అనిల్,మండల యూత్ అధ్యక్షులు తౌటం నవీన్ ,కో ఆప్షన్ మెంబెర్ రాజ్ మొహమ్మద్, స్థానిక టౌన్ ,యూత్ అధ్యక్షులు బుర్ర శ్రీధర్ గౌడ్,మాసు రమేష్, .కట్కూరి రాజేందర్. వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు, వివిధ విభాగాల అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా,మండల ముఖ్య నాయకులు ,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.