ప్రజలు మెచ్చేలా విధి నిర్వహణ

ప్రజలు మెచ్చేలా విధి నిర్వహణ చేయాలి : ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డిబదిలీపై వెళ్తున్న అధికారులకు ఘనంగా సత్కారం ఏ ప్రాంతంలో విధి నిర్వహణ చేసినా అక్కడి ప్రజల అభిమానం పొందడంతో పాటు ప్రజలు మెచ్చుకునే విధంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి అన్నారు.
మహబూబాబాద్ జిల్లా పరిధిలో పని చేసి బదిలీపై వెళ్తున్న సిఐ నాగేశ్వరరావు(PCR), సిఐ శ్యామ్ సుందర్(SBI), సిఐ కరుణాకర్(DCRB), ఎస్ఐ ఫనిందర్ , ఎస్ఐ అశోక్, ఎస్ఐ తాహెర్ బాబా లను శాలువాలు, పూలమాలలతో సత్కరించి వారి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం అనేక సవాళ్లతో కూడుకొని ఉంటుందని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సమయంతో సంబంధం లేకుండా విధి నిర్వహణ చేయాల్సి ఉంటుందన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.