మ‌రిపెడ‌: మ‌హ‌బూబాద్ జిల్లా మ‌రిపెడ మండలంలోని తానంచ‌ర్ల ప‌రిధిలోని మూల‌మ‌ర్రి తండా లో మంగళవారం జిల్లా స్టాంగింగ్ క‌మిటీ చైర్మెన్‌, మ‌రిపెడ జ‌డ్పీటీసీ తేజావ‌త్ శార‌దా ర‌వీంద‌ర్ నాయక్ఆధ్వ‌ర్యంలో లంబాడీలు సీత్లా భవానీ పండుగ ను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఆశాడమాసంలో ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. గ్రామ పొలిమేర వద్ద గిరిజనుల ఆరాధ్య దేవతలను ఏడుగురిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుళ్ళులతో యువతులు, మహిళలు, చిన్నారులు నృత్యాలు చేసుకుంటూ దేవతల వద్దకు సమూహంగా వెళ్ళి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ZPTC గారు మాట్లాడుతూ వర్షాలు బాగా కురువాలని, పంటలు బాగా పండి, పిల్లా, పాపలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సీత్లా భవానీ పండగ ప్రపంచం మొత్తంలో నివసిస్తున్న గిరిజన, లంబాడీల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతి రూపంగా నిలిచే పండగ అన్నారు. కేంద్ర రాష్ట ప్ర‌భుత్వాలు లంబాడీలు సంప్ర‌దాయ‌బ‌ద్దంగా జ‌రుపుకుంటున్న ఈ పండుగ‌ను గుర్తించి జాతీయ పండుగ‌గా ప్ర‌క‌టించాల‌ని, ప్ర‌తి ఏటా జూలై 12వ తేదిన పండుగ‌గా సెల‌వు దినం ప్ర‌క‌టించాల‌ని కోరారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.