ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి-డివైఎఫ్ఐ

ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ప్రజలు తినే ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్న బిర్యాని, ఫాస్ట్ ఫుడ్, బేకరీ, స్వీట్ హౌస్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ కళావతి కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి మాట్లాడుతూ
సీట్ హౌస్ ల వద్ద స్వీట్ తయారు చేసేవారు చేతులకు బ్లౌజులు పెట్టుకోవడం లేదని, రెండు చేతులతో లడ్డూలను తయారు చేస్తున్నారని, తయారుచేసిన స్వీట్ పై ఈగలు వాలడం దుమ్ము పడటం, వాటిలో బ్యాక్టీరియా చేరడం జరుగుతుంది, బాగా మరిగించిన ఆయిల్ లోనే సమోసాలు, పకోడీ,మిర్చీలు, కాల్చడం, మరిగించిన నూనెను మళ్లీ తెల్లారి వాడటం జరుతుంది. ఇష్టానుసారంగా రేట్లు పెంచి అమ్ముతున్నారు. రోడ్లమీద జిలేబిలు తయారు అదే పద్ధతిలో జరుగుతుంది. నాలాల పక్కన మీద స్వీట్ హౌస్ నిర్వహణ చేయడం వల్ల అందులో ఉన్న దుర్గంధము ఈగలు దోమలు వాటి మీద చేరుతున్నాయి, బేకరీలలో నిలువ ఉంచిన పదార్థాలను కుళ్ళి పోయిన వాటిని అమ్ముతున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనెను వాడుతూ ప్రజల అనారోగ్యానికి కారణం అవుతున్నారు, చికెన్,మటన్ సెంటర్లలో మిగిలిన వాటిని తక్కువ ధరకు బిర్యాని సెంటర్లకు పంపించడం వాటిని వండి ప్రజలకు పెడుతున్నారు. నగరంలోని ప్రజల ప్రాణలతో చెలగాటమాడుతున్న బిర్యాని ఫాస్ట్ ఫుడ్ స్వీట్ హౌస్ బేకరీ తనిఖీలు నిర్వహించి,చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ జిల్లా నాయకులు మోతే సతీష్ పల్లకొండ శ్రీకాంత్ పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.