ప్రజాభ్యుదయ దిక్సూచి,అభివృద్ధి కాణాచి డియస్ ఆర్

ప్రజాభ్యుదయ దిక్సూచి,అభివృద్ధి కాణాచి
డియస్ ఆర్ గారు.
శిశిరంలా రాలుతున్న ప్రగతి రథ తుషారాలు.. సంక్షేమ నిధుల సాగరంలో నియోజకవర్గం..
యంపిపి పద్మావతి రవి నాయక్ గారు.
కురవి మండలం తులిస్యతండా గ్రామపంచాయతీ లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ గారి కృషితో MGNREGS నిధుల నుండి వచ్చిన 10 లక్షల సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కురవి ఎంపీపీ గుగులోతు పద్మావతిరవినాయక్,TRS జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి గారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్యానాయక్ గారి కృషితో తండాల్లో రోడ్లకు మహర్దశ రానుందని అన్నారు. రెడ్యానాయక్ గారి ద్వారానే అభివృద్ధి సాధ్యమని అన్నారు.
TRS ప్రభుత్వం తండాల్లో రోడ్లకు ప్రాధాన్యత ఇస్తుందని,రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ గారిని,ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆదరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మూడ్ అరుణ శ్రీను,TRS యూత్ రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్,కురవి దేవాలయం మాజీ ఛైర్మన్ బాదావత్ రాజునాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బాదావత్ వీరన్న,వార్డుమెంబర్ లు,యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.