ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం-ఎండి అబ్బాస్

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్
సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూని చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి. అబ్బాస్ అన్నారు.
పేదవారికి గుడిసెలు ఇవ్వాలని ఈరోజు హనుమకొండ కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి విచ్చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్. సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి మరియు ఈరోజు జిల్లా వ్యాప్తంగా నాయకులనుఅక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పాలకుర్తి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అబ్బాస్ గారు పాల్గొని మాట్లాడుతూ. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేసి నేడు వాటిని అమలు చేయకపోగా ఇంటి స్థలం అడిగినందుకు పోలీసుల చేత అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. భూములను రియల్ ఎస్టేట్ మాఫియా అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తుంటే అధికారులు పోలీసు యంత్రాంగం పట్టీపట్టనట్లు ఉంటూ ఈరోజు ప్రభుత్వ భూముల లో నిలువ నీడ లేక గుడిసెలు వేసుకొని మన జీవితాన్ని పోషించుకుంటూ ప్రజలకు గూడు కోసం స్థలం ఇవ్వమని అడిగితే దౌర్జన్య పూరితంగా వ్యవహరిస్తూ ఉంది. వివిధ గ్రామాలనుండి వచ్చినటువంటి కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని అడిగితే అరెస్టు చేస్తారా అని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, రాపర్తి సోమయ్య, ఇర్రి అహల్య, బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు భూక్య చందు నాయక్, బి నరేందర్, పొదల నాగరాజు, ఉపేందర్, జోగు ప్రకాష్, చిట్యాల సోమన్న, మహేందర్, యాకయ్య, మాచర్ల సారయ్య, సొమ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.