ప్రజా ఉద్యమాల నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం

ప్రముఖ స్వతంత్ర సమర యోధులు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ప్రజల మనిషి మాజీ ఎంపీ ప్రజా ఉద్యమాల కోసం తన జీవితాన్ని అర్పించిన గొప్ప కమ్యూనిస్టు నాయకుడు అని సిపిఐ పట్టణ కార్యదర్శ దొర పెళ్లి శంకర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ధర్మం బిక్షం చౌక్ ఆయన విగ్రహం 11వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వతంత్ర సంగ్రామంలో వందేమాతర ఉద్యమం ఆర్యసమాజం గ్రంధాలయోద్యమం ఉద్యమం ఆంధ్ర మహాసభ హైదరాబాద్ సంస్థాన విముక్తికై జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టు ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన గొప్ప దేశ భక్తుడు అని కొనియాడారు. విద్యార్థి సంఘ నిర్మాణాలు కార్మిక సంఘాలు నిజాం వ్యతిరేక పోరాటాలు జైలు జీవితం శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు చేసిన ప్రజా సేవ సంఘం నిర్మాణం ప్రజా సంఘాల నిర్మాణం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మన్ననలు పొందిన గొప్ప నేత మన ధర్మభిక్షం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, సి ఐ టి యు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు, పట్టణ సహాయ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మురగూండ్ల లక్ష్మయ్య, సిపిఐ సీనియర్ నాయకులు ఖమ్మం పాటి అంతయ్య, బొమ్మగాని శ్రీనివాస్, నూతనకల్ మండల కార్యదర్శి తోట్ల ప్రభాకర్, చివేముల మండల కార్యదర్శి ఖమ్మం పాటి రాము, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు గోపగాని రవి, మహిళా నాయకురాలు దంతాల పద్మ రేఖ, హెచ్పిసిఎల్ కార్మిక నాయకులు నిమ్మల ప్రభాకర్, టైలరింగ్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్, రమేష్, రేగటి లింగయ్య, పొదిల లింగయ్య, బుర సైదులు, భాష, నేలపట్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.