#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

సిపిఎం.ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న.
ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేసి వంటనూనెలు పప్పులు కూరగాయలు తదితర వస్తువులను ప్రజా పంపిణీ ద్వారా అందించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న అన్నారు.
శుక్రవారం సిపిఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పాలకుర్తి తాసిల్దార్ కార్యాలయం ముందుకేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం కాకుండా దేశ ప్రజల ప్రజల ప్రయోజనాల రీత్యా బడ్జెట్లో సవరణలు చేసి ప్రజానుకూల బడ్జెట్ గా మార్చాలని ధర్నా చేసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని *స్థానిక డిప్యూటీ తాసిల్దార్ హరి ప్రసాద్ గారికి వినతి పత్రం అందజేశారు.
అనంతరం సోమన్న పాల్గొని మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని రైతాంగానికి ఉపాధి హామీ కూలీలకు. పేద. సామాన్య. మధ్యతరగతి. ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించే విధంగా బడ్జెట్ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ అధిపతులకు అనేక రాయితీలు ఇచ్చిందని అన్నారు.నిరుపేదలకు రైతాంగానికి ఇచ్చే సబ్సిడీలను ఎత్తివేసింది అని కార్పొరేట్ల పన్ను రాయితీ 12 శాతం నుండి 7 శాతం తగ్గించారని వారన్నారు. కార్మిక హక్కులను హరించే కార్మిక కొడ్ లను. విద్యుత్ ఛార్జీల పెంపు సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. విద్య వైద్య ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచాలన్నారు. ఇన్కంటాక్స్ పరిధిలోకి రాని కుటుంబాలకు నెలకు రూపాయలు 7500 నేరుగా నగదు రూపంలో ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు సోమ అశోక్ బాబు. ప్రజా సంఘాల నాయకులు బి వెంకన్న. జి యాదగిరి. కే సోమయ్య. కే బాబు. డి సోమన్న. కే బిక్షపతి. సోమయ్య. కే యాకమ్మ. యాదమ్మ. సుజాత. వెంకటమ్మ. లచ్చమ్మ .ఎల్లమ్మ . లక్ష్మి. తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.