ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వాలు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనక రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో చాకలి ఐలమ్మ స్మారక భవనం లో సిపిఎం ఏరియా పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, మహాసభను నిర్వహించారు. ఈ మహాసభకు సిపిఎం నాయకులు మాచర్ల సారయ్య, పయ్యావుల బిక్షపతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మోకూ కనక రెడ్డి, బోట్ల శ్రీనివాస్, రాపర్తి రాజు మాట్లాడారు. దేశంలో మోడీ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తూనే మరోవైపు నిరుద్యోగ సమస్యలను పెంచుతుంది అన్నారు. దేశం నేడు మతోన్మాదుల నుండి అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని, ప్రజాస్వామ్యం పై ప్రజా హక్కుల పై దాడి జరుగుతున్నాయని, హత్యలు నిరంకుశ చర్యలను పెరుగు పెరుగు తున్నాయి. మత అసమాన అరాచక శక్తులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వ రంగం ధ్వంసం అవుతుందని, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడం కూడా నిరంకుశ పాలన కొనసాగిస్తూ ప్రజల హక్కుల పై దాడులు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సింగారపు రమేష్, సోమ సత్యం, రాపర్తి సోమయ్య, మండల కార్యదర్శి చిట్యాల సోమన్న, లావుడియా అనిల్ చౌహాన్, బానోతు కిషన్, నాయక్, ఇంద్రారెడ్డి, సంపత్, రాజు, శాంతమ్మ, అంజమ్మ, చిన్నారి మల్లమ్మ, బిత్తిరి వెంకన్న, యాదగిరి, మాధవరెడ్డి, లక్ష్మణ్, సోమన్న, భాస్కర్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.