ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు బహిరంగ సభ

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చిన బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు

ఈ నెల 14న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా,మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో నిర్వహించు భారీ బహిరంగసభకు, కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు ముఖ్య అతిథిగా పాల్గొననున్న నేపధ్యంలో, ఈ రోజు డివిజన్ కేంద్రంలోని బిజెపి నియోజకవర్గ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి మరియు బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.

ఈ సమావేశంలో లింగాల ఘనపూర్,రఘునాథపల్లి,చిల్పూర్,జఫర్గడ్ మండలాల పార్టీ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు,వివిధ మోర్చాల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు,శక్తి కేంద్ర ఇంచర్జులు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.