ప్రజా సంగ్రామ యాత్ర 3 జనగామ జిల్లా సహా ప్రముఖ్ గా బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ నియామకం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర జనగామ జిల్లాలోని పాలకుర్తి,జనగామ,స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల మీదుగా కొనసాగనున్న నేపథ్యంలో,మూడు నియోజకవర్గాల జిల్లా యాత్ర సహా ప్రముఖ్ గా బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారిని బిజెపి రాష్ట్ర మరియు జిల్లా శాఖ నియమించింది.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బిజెపిని బూత్ స్థాయిలో పటిష్టపరుస్తున్న విధానాలకు,ఎల్లవేళల కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ,కార్యకర్తల కష్టాలలో, బాధలలో పాలు పంచుకుంటూ,వారికి బరోసా కల్పిస్తూ,పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించిన రాష్ట్ర,జిల్లా శాఖ వారిని ప్రజా సంగ్రామ యాత్ర జిల్లా సహా ప్రముఖ్ గా నియమించడం జరిగింది.
తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర,జిల్లా శాఖకు వారు కృతజ్ఞతలు తెలిపి,నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ,జనగామ జిల్లాలో సాగే ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేస్తామని తెలిపారు.