ప్రజా సమస్యలను పరిష్కరించకుండా మొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి ఈ పాదయాత్ర

ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క గారు మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం తిమ్మనేనిపాలేం గ్రామంలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర)లో హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ…

8 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి… ఇల్లు, ఫించన్, ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు.

కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్పా ఈ గ్రామంలో టిఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ..

విద్యుత్ ధర పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు…

మోడీ పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు

కాంగ్రెస్ ప్రభుత్వం 9 రకాల రేషన్ సరుకులు ఇస్తే.. .. బంగారు తెలంగాణలో 18 సరుకులను ఇవ్వాల్సిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సరుకులను బంద్ చేసి పేదల కడుపు కొడుతుంది.

ఒక రైతు చెప్పాడు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెసల విత్తనాలు సబ్సిడీ లో ఇచ్చే వారు . ఈరోజు అవి ఇవ్వట్లేదు ..గిట్టుబాటు ధర కూడా కల్పించలేదు….

ఒక్కొక రైతు ఒక్కొక బాధ చెపుతున్నారు….పత్తిని గులాబీ పురుగు,మిర్చిని తామేర పురుగు నాశనం చేస్తున్నాయి. అలాగే గులాబీ పార్టీ పాలకులు రాష్ట్రాన్ని, తామర పువ్వు పార్టీ పాలకులు దేశాన్ని నాశనం చేస్తున్నాయి

దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తల పైన ఉన్నది. అందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పోరాడాలి...

పేదవాడికి అండగా సంస్కరణ లు చేసిన కాంగ్రెస్ మాత్రమే ఈ దేశాన్ని,దేశ ప్రజలను కాపాడుతుంది….

లేకుంటే మోడీ,అమిత్ షా ఈ దేశాన్ని అమ్ముతారు…

తిమ్మినేనిపాలేం పాదయాత్రలో వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శులు శివకుమార్, మహమ్మద్ అయూబ్, హన్మకొండ & వరంగల్ డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాహుల్ రెడ్డి, హసన్ పర్తి నియోజకవర్గ నాయకులు రవీందర్, హనుమకొండ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ గంగారపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.