మండల కేంద్రంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రవీంద్రారెడ్డి అధ్యక్షతన శనివారం ఉదయం ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావుకు, ఎంపీటీసీలకు మండల పరిషత్ సిబ్బంది అభినందన సభ ఏర్పాటు చేశారు..
ఈ కార్యక్రమంకు ఖమ్మం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు హాజరై ఎంపీపీని శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించారు, తొలుత డీసీఎంఎస్ చైర్మన్, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు చేత మండల నాయకులుతో కలిసి కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ చాలాకాలం తర్వాత మండలంకు కార్యదక్షిత కలిగిన కార్యోముఖుణ్ణి పొందుకున్నామని, కావున మండల ప్రజలందరూ ఆయన సేవలను వినియోగించుకుని అభివృద్ధి చెందాలని,ఈ సందర్బంగా ఆయన ప్రజలకు సూచించారు…
అనంతరం ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ నాకు సాధ్యమైనంత వరకు ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని, ఇంతకాలం నాకు సహకరించిన ప్రజా ప్రతినిధులు,అధికారులు, అనధికారులుకు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మండల స్థాయి, గ్రామస్థాయి నాయకులు అధికారులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు