ప్రజా సేవ చేయడంలోనే ఎంతో సంతృప్తి ఉందని టీ అర్ ఎస్ జిల్లా నాయకులు పంతoగి దశరథ గౌడ్ అన్నారు.సోమవారం కుడ కుడ 14వార్డులో డ్రైనేజ్ పైపులు పగిలి పోయి తీవ్ర ఈ బ్బందులు పడు తున్న విషయం తన దృష్టికి రావడం తో సొంత కర్చులు రూ.10,000 తో 200 మీటర్ల మేర డ్రైనేజ్ పైపులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా దశరద గౌడ్ మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజల కోసం చేసే సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తి నీ ఇస్తాయని చెప్పారు. కరోనా లాక్ డౌన్ కాలంలో వార్డు లో బియ్యం, కూరగాయలు ,నిత్యావసరాల సరుకులు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు లక్ష్మణ్,సోమయ్య,వీరయ్య, రమణ, వెంకన్న,జనయ్య, మనోజ్, రాజు, నాగరాజు, వెంకన్న, మహేష్ తదితరులు ఉన్నారు.