mahabubad news telugu news

కుష్ఠు వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బిందుశ్రీ అన్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నా పగిడిపల్లి గ్రామం లో బుధవారం కుష్ఠు వ్యాధి రాష్ట్ర బృందం సందర్శించారు. కుష్ఠు వ్యాధి గురించి గ్రామం లో సర్వే నిర్వహించి 120 ఇండ్లు తిరిగి అవగాహనా కల్పించారు. కుష్ఠు వ్యాధి గురించి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బిందుశ్రీ మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి ఇతర అంటు వ్యాధులవాలె మైక్రో బాక్టీరియా లేపే అనే బాక్టీరియా వలన వస్తుంది. వ్యాధి లక్షణాలు ముఖ్యంగా శరీరం పై పాలిపోయిన లేదా రాగి రంగు మచ్చలు, ఆ మచ్చ ల పై స్పర్శ లేనప్పుడు మరియు నొప్పి తెలియనప్పుడు, పెరిఫెరల్ నరముల బలహీనత, మరియు కళ్ళు, శ్వాస వ్యవస్థ ను ప్రభావితం చేస్తుంది. ప్రాథమిక దశలో వ్యాధి ని గుర్తించి మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా పూర్తిగా నివరించవచ్చని, ప్రాథమిక దశ లో గుర్తించ కుంటే అంగవైకల్యం వస్తుందని, లెప్రసీ చికిత్స ప్రతి ఆరోగ్య కేంద్రం లో అందుబాటులో ఉంటుందని వావిరించారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ గుగులోతు రవి, స్టేట్ శాంపిల్ సెర్వే యూనిట్ ఏపీఎంస్ శ్రీనివాస్ రెడ్డి, లోకే మధు, నర్సింహా రెడ్డి, లూర్డ్ మేరీ, అరున్, హెల్త్ ఎడ్యుకేటర్ పురుషోత్తం, హెల్త్ సూపర్ వైజర్ రాధ కుమారి, ఏ ఎన్ ఎం వనిత, స్టాఫ్ నర్స్, మాధవి, ఆశాలు ఉపేంద్ర, అనిత, కల్పనా, జ్యోతి, నిర్మల పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.