ప్రతి పీజీ విద్యార్థికి 5000/-రూ PhD విద్యార్థికి 20,000 రూ"-ఫెలోషిప్ ఇవ్వాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్

ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేటు ముందు నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్ మూర్తి హాజరైనారు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన యూనివర్సిటీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవరిస్తుందని అన్నారు. దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్నా యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. యూనివర్సిటీలో చదివే వారందరూ వెనుకబడిన సామాన్య విద్యార్థులు కావున కేజీ టు పీజీ ఉచిత విద్య ప్రభుత్వ హామీలో భాగంగా ఉచిత మేస్ సౌకర్యాన్ని కల్పించాలని,రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పీజీ విద్యార్థికి 5000 రూ” పీహెచ్డీ విద్యార్థికి 20000 రూ” ఫెలోషిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితో పాటు రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలో 3000 పైగా ఉన్న టీచింగ్,నాన్ టీచింగ్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. రాబోయే బడ్జెట్ లో యూనివర్సిటీలకు అధిక నిధులు కేటయించాలని కొరినారు. కాకతీయ యూనివర్సటీలో phd నోటిఫికేషన్ ఇవ్వాలి ని అన్యాక్రాంతం అవుతున్న యునివర్సిటీ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేసినారు.ప్రభుత్వం ఇప్పటి కైన యూనివర్సిటీల సమస్యల పరిష్కారం చేసేలా ఉండాలని లేక పోతే విద్యార్థులందరిని కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వరంగల్ అర్బన్ కార్యదర్శి సంతోష్ కేయూ వైస్ ప్రెసిడెంట్ కళ్యాణ్, శ్రీకాంత్ వినయ్, పవన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు….

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.