ప్రతి ప్రైడ్ డ్రై డే ను నిర్వహించాలి: డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

నడిగూడెం మండలం త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మంగళవారం ఆశా డే సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అసంక్రమిత వ్యాధుల అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల వల్ల ఎన్నో అంటు వ్యాధులు వచ్చే అవకాశం కావున సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని , ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు నిర్వహించాలని అన్నారు. అసంక్రమిత వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గ్రామాలలో బీపీ మరియు షుగర్ పేషెంట్ల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సిబ్బందిని కోరారు. గ్రామాలలో భ్రూణ హత్యలు చేసే వారి వివరాలు సేకరించాలని,అనవసరంగా అబార్షన్లు చేసే వారిపై దృష్టి పెట్టాలని, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి తీసుకురావాలని,పురుషులు స్త్రీల మధ్యలో లింగ నిష్పత్తి రోజురోజుకు అంతరం పెరుగుతుందని ,అమ్మాయిలను కాపాడుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలని అన్నారు. మొదటి కాన్పులో సాధారణ ప్రసవం అయితే రెండవ కాన్పు కూడా సాధారణమవుతుందని అందుకొరకు ప్రతి ఒక్కరు సహజ ప్రసవాలపై దృష్టి పెట్టాలని , సహజ ప్రసవాలు అయ్యే విధంగా సిబ్బంది కృషి చేయాలని కోరారు. సిజేరియన్ ఆపరేషన్ వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించాలని సూచించారు. దోమలు పుట్టకుండా ఉండకుండా చూసుకోవాలని అన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి ర్యాలీ నిర్వహించారు. వివిధ రకాల స్లోగన్లతో ఈ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీప్రసన్న , సూపర్వైజర్లు విజయ్ కుమార్, ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.