ప్రతి మహిళా సమానత్వం కోసం పోరాడాలి

మహిళల కు రక్షణ ఇవ్వలేని పాలకులు ధిగిపోవాలి

ప్రగతిశీలా మహిళా సంఘము రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కే. రమ, చండ్ర అరుణ
ప్రతి మహిళా సమానత్వం కోసం, సమసమాజం కోసం పోరాడాలని,మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలకులు ధిగిపోవాలని కోరుతూ కొత్త బస్టాండు నుండి పబ్లిక్ క్లబ్బు వరకు ప్రదర్శన నిర్వహించి సదస్సు జరిపి ప్రతి మహిళ ప్రగతిశీల చైతన్యంతో తమను తాము కాపాడుకోవటం లో ముందు ఉండాలి అని ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కట్టా రమ, చండ్ర అరుణ మహిళలకు పిలుపునిచ్చారు.
దేశంలో రాష్ట్రంలో ఎక్కడ చూసిన మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది అని, మొన్న మైనర్ బాలికపై, నిన్న ఖమ్మం లో గర్భిణీ స్త్రీ పై కామాంధుల చేసిన పైశాచికత్వం ఇలా ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి మహిళలు వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోతుందని దీనికి కారణం ప్రభుత్వాల అసమర్థత అని అన్నారు. డబ్బున్న వారు అధికార పార్టీ నాయకులు వారికి సంబంధించిన వారు మహిళలపై అఘాయిత్యాలు చేస్తే పట్టించుకోని పోలీసులు అమాయకులు అయితే ఎన్కౌంటర్లు చేస్తారని, చట్టాలు ఉన్నవాడు చుట్టాలు మారుస్తున్నారని అందుకే ప్రతి మహిళ ప్రగతిశీల పోరాట స్ఫూర్తితో చైతన్యంతో తనకు తాను రక్షించు కునే విధంగా ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళ సంఘము జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రేణుక, పూలన్ , ప్రజా పంథా జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్, ప్రజా పంథా కోదాడ డివిజన్ కన్వీనర్ అంజన్న, తుంగతుర్తి డివిజన్ కన్వీనర్ రామన్న, రాధిక జిల్లా నాయకులు అఖిల్,జయమ్మ, చంద్రకళ,ఐ. ఎఫ్.టి.యు జిల్లా కన్వీనర్ రామోజీ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.