ప్రత్యేక చొరవ తో కుటుంబానికి రెండు లక్షలు మంజూరు చేయించిన మంత్రి

మాటల మనిషిని కాదు తాను చేతల మనిషి ని అని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి మరోసారి చాటారు.. గత నెలల లో కొత్త బస్టాండ్ సమీపంలో డీజిల్ టాంకర్ పేలిన ఘటనలో మృతి చెందిన ముగ్గురు కుటుంబాలను పరామర్శించిన
ఇటీవల డీజిల్ ట్యాంకర్ పేలి మృతిచెందిన కార్మికులు గట్టు అర్జున్,మంత్రి అర్జున్,ఏలుపుల మల్లికార్జున్ కుటుంబాలను పరామర్శించినమంత్రి పెద్ద దిక్కు లను కోల్పోయి దిక్కు తోచని స్థితి లో ఉన్న కుటుంభ సబ్యులకు ధైర్యం చెప్పడం తో పాటు నేను ఉన్నానంటూ మనో ధైర్యం కల్పించారు.. తాను ఇచ్చిన మాట ప్రకారం.. సీఎం గారితో ప్రత్యేకంగా మాట్లాడి ప్రభుత్వం తరుపున రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేయించారు..మంజూరు అయిన చెక్ లను సూర్యాపేట పట్టణం లోని కుడ..కుడ ,చింతల చెరువు , కోట మైసమ్మ బజార్ లలోని మృతుల ఇళ్లకు వెళ్లి మంత్రి స్వయంగా అందజేశారు..కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ప్రభుత్వం తరుపున ఎక్స్ గ్రేషియా ఇప్పించి దిక్కు తోచని స్థితి లో ఉన్న తమను పెద్ద దిక్కు లా ఆదుకున్న మంత్రి జగదీష్ రెడ్డి కి బాధిత కుటుంభ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ, కౌన్సిలర్లు ఎలిమినేటి అభయ్, భరత్ మహాజన్, కీసర వేణుగోపాల్ రెడ్డి, రమేష్ , టి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.