#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

పాలకుర్తి/E6news

మండల కేంద్రంలోని అహ్మదియ ముస్లిం జమాత్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ముహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం సామూహిక ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ
నేటి పరిస్థితుల్లో మానవాళి రక్షణ కోసం ప్రపంచ అహ్మదీయ ముస్లింలందరూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలని అహ్మదియ ఐదవ ఉత్తరాధికారి హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ పిలుపునిచ్చారని,215 దేశాలలో వ్యాపించి ఉన్న తన అనుయాయులను ఇప్పటికే అలుముకున్న యుద్ధ వాతావరణం మరింత వేడెక్కకుండా ప్రార్థనలతో మానవాళికి మేలు చేసే ప్రయత్నం చేయాలని, శుక్రవారం ముస్లిం టెలివిజన్ అహ్మదియ అంతర్జాతీయ టీవీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో పిలుపునిచ్చారని అన్నారు. ఈ సందర్భంగా మస్రూర్ అహ్మద్ ఇలా ఉపదేశించారని..నేడు ప్రపంచ పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారాయి. ఇంకా భయంకరంగా ప్రమాదం పొంచి ఉంది. ఇలా కొనసాగితే ఇందులో కేవలం ఒకటి,రెండు దేశాలు కాదు చాలా దేశాలు పాల్గొంటాయి తద్వారా దీనికి భయానక అంతం యొక్క ప్రభావం తర్వాతి తరాల వరకు ఉంటుంది దేవుడు వీళ్లను తనను గుర్తించేటట్లు చేయుగాక మరియు యుద్ధం యొక్క భయానక పరిస్థితుల నుండి మరియు వినాశనం నుండి మానవాళిని రక్షించుగాక అని హితబోధ చేసి ప్రార్థనలు చేశారని అన్నారు.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో సర్కిల్ ఇంచార్జ్ మహమ్మద్ అక్బర్ మాట్లాడుతూ..అహ్మదీయ ముస్లిం జమాత్ ముందు నుండి కూడా ప్రపంచ శాంతి గురించి మరియు మానవత్వం గురించి కృషి చేస్తున్నదని,ప్రతి సంవత్సరం ప్రపంచంలోని అనేక దేశాలలో శాంతి సదస్సులు ఏర్పాటు చేసి మేధావులను మరియు రాజకీయ నేతలను ఆహ్వానించి వారిని ఆధ్యాత్మికంగా మరియు ధార్మికంగా ఎదుగుతూ ప్రపంచంలో నెలకొన్న సంక్షోభాన్ని దూరంచేసి ప్రపంచశాంతి గురించి కృషి చేయాలని హితబోధ చేయడం జరుగుచున్నదని, మిర్జా మస్రూర్ అహ్మద్ (ఉత్తరాధికారి)ప్రపంచ పలు దేశాల అధ్యక్షులకు ప్రపంచ శాంతి మరియు మానవత్వం గురించి అనేక సందర్భాల్లో మార్గనిర్దేశం చేశారని తెలిపారు.ఈకార్యక్రమంలో స్థానిక అహ్మదీయ అధ్యక్షులు ముహమ్మద్ యాకూబ్,మహమ్మద్ యాకూబ్,రహీముద్దీన్,షరీఫ్,ఖాజా,భాషా,తాహెర్, యాకూబ్,అబ్బాస్అలీ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.