ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే వారోత్సవాలను విజయవంతం చేయండి

ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను పురస్కరించుకొని అన్ని రంగాల కార్మికులు. ప్రజలు. వ్యవసాయ కూలీలుమేడే జెండా ఆవిష్కరణలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పాలకుర్తి ఏరియా కమిటీ కార్యదర్శి సింగారపు రమేష్ పిలుపునిచ్చారు.
బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలోని సిపిఎం కార్యకర్తల సమావేశం చాకలి ఐలమ్మ స్మారక భవన్లో జరిగింది. ఈ సమావేశానికి రాజు అధ్యక్షత వహించగా రమేష్
పాల్గొని మాట్లాడుతూ కార్మికవర్గ ఐక్యత కు మేడే స్ఫూర్తితో కేంద్ర బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు. కేంద్ర బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల కు సవరణలు చేస్తూ పెట్టుబడిదారులకు బహుళజాతి కంపెనీల పారిశ్రామికవేత్తలకు యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలు తెస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మేడే స్ఫూర్తితో ఉద్యమించాలని వారు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నరని అన్నారు దేశంలో బిజెపి ప్రభుత్వం 8 గంటల నుండి 12 గంటలకు పని దినాన్ని పెంచి కార్మికులపై అదనపు పని గంటల భారాన్ని మోపి శ్రమదోపిడి చేస్తున్నదని విమర్శించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా దేశంలో రాష్ట్రంలో ఉద్యోగ కార్మికుల కు భద్రత లేకుండా పోయిందని అన్నారు అసంఘటిత రంగం కార్మికులకు సామాజిక భద్రత కరువైందని అన్నారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ కార్మిక వర్గానికి అండగా పోరాటాలు నిర్వహించాలని పేర్కొన్నారు. కార్మిక వర్గం. మరియు వ్యవసాయ కూలీలు ప్రజలు శ్రమ దోపిడీ తో పాటు సామాజిక అణచివేత వివక్షత కొనసాగుతూనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న. సిఐటియు నాయకులు ఏనుగు తల సమ్మయ్య. ఎండి పరిద్. వెంకన్న. సోమన్న. నాగన్న తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.