పట్టభద్రుల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలను వాయిదా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతకు సందేశాన్ని ఇచ్చిన ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ రాష్ట్ర యువజన అధ్యక్షులు డాక్టర్ సామల శశిధర్ రెడ్డి ప్రపంచాన్ని గడగడ వణికించిన అతి భయంకరమైన వ్యాధి క్యాన్సర్. ఈ క్యాన్సర్ వ్యాధి చాలా విచిత్రంగా వివిధ రూపాల్లో రావడం ఆడవారిలో ఒక విధంగా అవయవాల రూపంలో మగవారిలో సైతం మరో విధంగా రావడం అందరూ క్యాన్సర్ బారిన పడుతూ వారి తనువులు సాధిస్తున్నారు అందులో భాగంగా ముఖ్యంగా యువతలో గుట్కా, ఖైని,తంబాకు,సిగరెట్, బీడీ,జర్దా లాంటి నిషేధిత ఉత్పత్తులను వాడటం ద్వారా క్యాన్సర్ వ్యాధి అతి తొందరలో మనలోకి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని కనుక యువత క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెడు వ్యసనాలు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అలాగే నిషేధిత ఉత్ప్రేరకాలు అయినటువంటి గంజాయి, కొకైన్,మత్తు మందు లాంటి వాటికి అలవాటు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లలను తమ పర్యవేక్షణలో ఉంచుకోవాలని అలాగే పాఠశాల కళాశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులపై నిఘా వేసి ఉంచాలని విజ్ఞప్తి చేశారు. సరైన అవగాహన లేక ఎంతోమంది యువత ఈ వ్యసనాలకు అలవాటు పడి క్యాన్సర్ బారిన పడుతూ చివరికి మరణించడం జరుగుతున్నదని వారు వివరించారు. కనుక ఇప్పటికైనా యువత మేల్కొని క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఇతరులకు అవగాహన కల్పించే విధంగా కృషి చేయాలని అప్పుడే క్యాన్సర్ పై సంపూర్ణ విజయం సాధిస్తామని ఈ అంశాన్ని తమ బాధ్యతగా స్వీకరించి యువతీ యువకులు ముందుకు రావాలని వారికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా క్యాన్సర్ పట్ల ప్రజలలో మరింత అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని వారు అన్నారు అలాగే క్యాన్సర్ బారిన పడిన వారికి సహాయ సహకారాలు అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు ఎల్లవేళలా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.