ప్రభుత్వాల మోసపూరిత విధానాలని వ్యతిరేకించాలి సిపిఎం ఆధ్వర్యంలో నిరసన

ఆదివారం పాలకుర్తి మండలలొని గూడూరులో రాస్తారోకో నిర్వహించారు. దర్దపల్లి గ్రామంలో ఆటో కు తాడు కట్టి లాగుతూ సిపిఎం ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య జనం పై కక్ష కట్టినట్లు గా ప్రజలు వాడే ప్రతి వస్తువు ధరలను పెంచుతుంది అన్నారు.50శాతం నుండి 60 శాతం వరకు పెరిగాయి అన్నారు.పెట్రోల్ డీజిల్ ధరలు అయితే ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు గా రోజుకొకసారి పెరుగుతూ సామాన్య జనం నడ్డి విరిగేలా చేస్తున్నాయని వారన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 సంవత్సరంలో 500 రూపాయలు ఉన్న సిలిండర్ ధర నేడు వెయ్యి రూపాయలకు దాటింది అన్నారు. కోవిడ్ దెబ్బకు అతలాకుతలమైన సామాన్య మధ్యతరగతి ప్రజలు నిత్యావసర ధరలకు విలవిలలాడుతున్న రని అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ధరలను అరికట్టాలని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కరెంటు చార్జీలు. ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి విద్యుత్ చార్జీలను 34 శాతం. మేర పెంచింది అన్నారు. సామాన్యజనానికి జబ్బులు వస్తే వాడుకునే అత్యవసర మందుల పై కూడా ధరలు పెంచి పేదల ఉసురు తీస్తున్నారు అన్నారు. సామాన్య జబ్బులకు వాడే 850 రకాల మందుల ధరలు 10 శాతం పెంచి వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో అదనంగా పెరిగిన మందుల ఖర్చులు పెనుభారం అవుతుందన్నారు. ఇప్పటికైనా పెరిగిన ధరలను తగ్గించని ఎడల ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలొ బీఎస్పీ నాయకులు చెరిపెళ్లి కుమార్. సిపిఎం నాయకులు బెల్లి సంపత్. ముస్కు ఇంద్రారెడ్డి. పనికర రాజు. వేల్పుల కుమార్. వేల్పుల కొమురయ్య. సాంబాజి. నక్క రవి. మచ్చు పాడు సోమయ్య. డివైఎఫ్ఐ నాయకులు బెల్లి సతీష్. మల్లేష్. రవి. సాగర్. మల్లేష్. తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.