ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్న ప్రైవేటు పాఠశాల యాజమాన్యం

ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్న ప్రైవేటు పాఠశాల యాజమాన్యం సెలవుల్లో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వరంగల్ జిల్లాలోని కాశిబుగ్గ ప్రాంతంలో గల గీతాంజలి కాన్సెప్ట్ స్కూల్ నిర్వాహకులు హై స్కూల్ కు పర్మిషన్ లేకుండా గత మూడు సంవత్సరాలుగా 8,9,10 తరగతులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఈరోజు పాఠశాలలో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదేశాలను నిర్వీర్యం చేసిన సందర్భం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు ప్రకటించారు. కానీ అందుకు భిన్నంగా, విరుద్ధంగా కాశిబుగ్గ లోని గీతాంజలి పాఠశాల యాజమాన్యం ప్రవర్తించిన తీరు చాలా విడ్డూరంగా ఉంది రెండు రోజుల క్రితం పాఠశాలను వరంగల్ మండల విద్యాశాఖ అధికారి గారు సందర్శించినప్పుడు పాఠశాలను మూసి వేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. అది జరిగి రెండు రోజులు గడవక ముందే ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం పట్ల వారు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో అర్థం అవుతుంది కాబట్టి మండల విద్యాశాఖ అధికారి గారు మరియు జిల్లావిద్యాశాఖ అధికారి గారు ఈ పాఠశాల పైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నట్లు ఫోరం ఫర్ ఆర్టీఐ తెలంగాణ రాష్ట్ర శాఖ అధికారులకు సూచించింది.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.