ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని నిరుపేదలు లబ్ధి పొందాలి.


షెడ్యూల్ కులాలలోని యువతీ యువకులు ప్రభుత్వ పథకాలు వినియోగించుకుని రాణించాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ తెలిపారు.

గురువారం మరిపెడ మండలంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ లతో కలిసి మండల కేంద్రంలో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలు తీరును సందర్శించి పరిశీలించారు.
మరిపెడ లో టి యు.ఎఫ్ ఐ డి సి నిధు లు 224.24 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వెజ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పక్కనే 123.49 కోట్లతో నిర్మిస్తున్న ఆడిటోరియం నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని జూన్ నెలాఖరు లోగా పూర్తిచేయాలని జాప్యం చేయరాదన్నారు అనంతరం ఎస్సీ కాలనీలో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు కమ్యూనిటీ భవనాన్ని కేవలం పెళ్లిళ్లకు ఇతరత్రా వేడుకలకు వినియోగించుకోవడం ఏ కాకుండా నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి కొరకు కంప్యూటర్స్ మంజూరు చేస్తామని కంప్యూటర్స్ పై శిక్షణ పొంది ఉపాధి పొందాలన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.