ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలని ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా

ప్రభుత్వ పాఠశాల లో నెలకొన్న సమస్యలు ను పరిష్కరించాలని ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ గారిని కలవటానికి వెళుతున్న సమయంలో ఖమ్మం నగర ఎస్.ఐ నుంచి ఏ.సీ.పీ వరకు విద్యార్థులను అడ్డుకున్న క్రమంలో విద్యార్థి నాయకులు పోలీసుల మధ్య తోపులాట ఘర్షణ వాతావరణానికి దారితీసింది.. విద్యార్థి నాయకులను నెట్టటం, లాగటం, గొంతులు పిసకడం జరిగింది..

ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్ & మధు మాట్లాడుతూ :- ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం ప్రారంభించి 18 రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు ఏ పాఠశాలలో కూడా పాఠ్యపుస్తకాలు అందించలేదని అదేవిధంగా యూనిఫార్మ్స్ కూడా ఇంతవరకు రాలేదని ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయకపోటo వల్ల విద్యార్థులు పాఠ్యాంశాలకు దూరమవుతున్నారని కనీసం విద్యా వాలంటరీ ను కూడా భర్తీ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదని, అదేవిధంగా గత రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య పనులకు స్కావెంజర్ లేకపోవడం వల్ల పాఠశాలలో క్లీనింగ్ చేయగా విద్యార్ధులు నానా ఇబ్బందులు పడుతున్నారని, మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచి నాణ్యమైన భోజనం అందించాలి. పెండింగ్ వంటషేడ్లు, భోజన బిల్లులు విడుదల చేయాలని, మన ఊరు-మన బడి లో అన్ని పాఠశాలలను చేర్చి అభివృద్ధి చేయాలని, కంప్యూటర్ విద్యను అభివృద్ధి చేసి ,పాఠశాలలో ఇన్ స్ర్టక్టర్ లను నియమించాలి. ప్రతి పాఠశాలలో రాత్రి వాచ్ మెన్ ని నియమించాలని, ఆట వస్తువులను కోనుగోలు చేసి ఖాళీగా ఉన్న పిఇటి, పి.డి.పోస్టులను భర్తీ చేయాలని, ఎం.ఇ.ఓ.,టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. నాన్ టీచీంగ్ పోస్టులు భర్తీ చేయాలని, త్రాగునీరు, టాయిలెట్స్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి. చిన్న, చిన్న రిపేర్లు చేయించాలి. రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలని, ప్రతి పాఠశాలకు కరెంటు సౌకర్యం కల్పించి,ఇంటర్నెట్ అందించాలి. ప్రహారిగోడలు లేని పాఠశాలలకు ప్రహారి నిర్మాణం చేయాలి.. అన్నీ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది… ఈ సందర్బంగా ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సాయి, రాజు, శ్రావణి, ఎస్.ఎఫ్.ఐ నాయకులు వెంకటేష్, నాని, తరుణ్ ,విజయ్, గణేష్, నితిన్, రజినీ, రాజేశ్వరి, గీతా తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.